Home తెలంగాణ హైదరాబాద్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస దాడులు.. పలుచోట్ల వెలుగుచూసిన షాకింగ్ నిజాలు…!

హైదరాబాద్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస దాడులు.. పలుచోట్ల వెలుగుచూసిన షాకింగ్ నిజాలు…!

87
0
  • శుభ్రత లేని హోటళ్లలో ఆహారం తీసుకోవడం నివారించాలి.
  • ఆహారం నాణ్యతపై అనుమానం ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.
  • బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి.
  • ఆహారం రంగు, వాసన, రుచిలో తేడా కనిపిస్తే వెంటనే వినియోగాన్ని నిలిపివేయాలి.

TGN NEWS (హైదరాబాద్): నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల నిర్వహిస్తున్న వరుస తనిఖీల్లో ఆందోళనకర అంశాలు బయటపడుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసే విధంగా కొన్ని హోటళ్లలో శుభ్రత లేకపోవడం, గడువు ముగిసిన లేదా పాత ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసి తిరిగి వినియోగించడం వంటి ఉల్లంఘనలు గుర్తించారు.

అధికారుల తనిఖీల్లో కొన్ని హోటళ్లలో రెండు నుంచి మూడు రోజుల క్రితం తయారుచేసిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. అలాగే వంటగదుల్లో అపరిశుభ్ర వాతావరణం, సరైన పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, ఆహార పదార్థాలను సక్రమంగా నిల్వ చేయకపోవడం, గడువు ముగిసిన ముడి పదార్థాలు ఉండటం వంటి అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో పాటు, కొన్ని చోట్ల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. నివేదికల ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఫుడ్ సేఫ్టీ విభాగం నగరవ్యాప్తంగా తనిఖీలు కొనసాగిస్తోందని, ప్రజల ఆరోగ్యంతో రాజీ పడే హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ప్రజలకు సూచనల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here