మేడ్చల్ జిల్లా పరిధిలో పశు సంచారా వైద్య సేవలు అందిస్తున్న 1962 సిబ్బంది గత మూడు నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1962 ఉద్యోగులు జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని మేడ్చల్ జిల్లా పశు సంచార వైద్యులు తెలిపారు. గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వకున్నా ముగా జీవాలకు తాము వైద్య సేవలు అందిస్తున్నామని, పశు సంచార వైద్యులు తెలిపారు. విపరీతంగా నిత్యవసర ధరలు పెరిగాయని, సకాలంలో జీతాలు అందకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1962 పశు సంచార వైద్య సేవల సిబ్బందికి జీతాలు మంజూరీ చేయాలనీ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
