రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ విశ్వకర్మ దేవాలయంలో విశ్వకర్మ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి సునంద చారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ – “సమాజ నిర్మాణంలో శ్రామికుల పాత్ర అపూర్వం. శ్రమజీవుల దేవుడైన విశ్వకర్మ మహర్షి ఆరాధనతో సమాజం సృష్టిశక్తిని పొందుతుంది. వారి శ్రమతోనే దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా శ్రామిక కుటుంబాలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని తెలిపారు.
అలాగే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నరసింహ చారి, పండురంగ చారి, సాయి వెంకట హర్ష, మాయ బ్రాహ్మణ, దేవేందర్ చారి, రాజు కుమార్ చారి, రాములు చారి, జగన్ మోహన్ చారి, చంచయ్య, రామ్మూర్తి, విష్ణుమూర్తి, నాగభూషణం, బ్రహ్మం, పాండు, శ్రీనివాస్ చారి, రాజేందర్ చారి, విశ్వకర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
