Home తెలంగాణ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఆవుల రాజిరెడ్డి 

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఆవుల రాజిరెడ్డి 

403
0

TGN NEWS (నర్సాపూర్):  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి చిలిపి చెడు మండల కేంద్రంలో ₹4,37,000 విలువగల 12 చెక్కులను అందజేసారు.. మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం ₹4,37,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ –”ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎంఆర్ఎఫ్ సహాయం మాకు నిజమైన భరోసాగా నిలిచింది. వైద్య ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న మా కుటుంబాలకు ఇది ఆశాకిరణంగా మారింది. ఈ సహకారం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఎల్లప్పుడూ మా సమస్యలను పట్టించుకుని, సీఎంఆర్ఎఫ్ సహాయం అందేలా కృషి చేసిన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here