Home తెలంగాణ తెలంగాణ అభివృద్ధి నమూనాను ప్రపంచ బ్యాంక్ ధృవీకరించింది: కేటీఆర్

తెలంగాణ అభివృద్ధి నమూనాను ప్రపంచ బ్యాంక్ ధృవీకరించింది: కేటీఆర్

28
0

ప్రపంచ బ్యాంక్ తాజా గుర్తింపు తెలంగాణ అభివృద్ధి నమూనాపై అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

తెలంగాణ 2025-26లో 5,407 అమెరికన్ డాలర్ల తలసరి ఆదాయంతో ఎగువ మధ్య-ఆదాయ రాష్ట్రాల జాబితాలో చేరడం కేసీఆర్ నాయకత్వంలో అమలైన అభివృద్ధి విధానాల ఫలితమని పేర్కొన్నారు.

పారిశ్రామిక పెట్టుబడులు, వ్యవసాయ రంగ సంస్కరణలు, సంక్షేమ పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని ఆయన తెలిపారు. టీఎస్-ఐపాస్, కాళేశ్వరం, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి పథకాలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు.

తెలంగాణను ఆర్థికంగా బలహీన రాష్ట్రంగా చూపించే ప్రయత్నాలను ప్రపంచ బ్యాంక్ నివేదిక పూర్తిగా ఖండించిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన బలమైన పునాదులపై రాష్ట్రం ముందుకు సాగుతోందని కేటీఆర్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here