Home ఆంధ్రప్రదేశ్ నరసరావుపేటలో బ్యాంకుల రుణ మేళా.. పాల్గొన్న నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు

నరసరావుపేటలో బ్యాంకుల రుణ మేళా.. పాల్గొన్న నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు

12
0

పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ‘క్రెడిట్ అవుట్‌రీచ్’ (రుణ మేళా) కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు రుణాలను పంపిణీ చేసి, ఆర్థిక సాధికారతకు తోడ్పాటునిచ్చారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన అంబులెన్సులను నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కావడంతో పాటు స్వయం ఉపాధి, వ్యాపారాభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడమే ఈ రుణ మేళా ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

ఇదిలా ఉండగా, కార్యక్రమానికి ముందు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి నరసరావుపేటకు చేరుకుని రుణ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here