కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తున్న ముగ్గురు బాలురను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ (17), లక్ష్మీతేజ (17) అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని టిప్పర్‌ను సీజ్ చేశారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






