ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తున్న మెదక్ డీఈవో, ఇతర విద్యాధికారులపై చర్యలు తీసుకోవాలి. * ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా కార్యనిర్వాక అధ్యక్షులు అస్తరగల్ల బాలరాజ్
ఈరోజు గున్షన్ క్లబ్ వద్ద ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో అక్రమ ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని గుర్తింపు లేని పాఠశాలలు రద్దు చేయాలని కోరుతూ, నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ, మెదక్ జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాధికారులు విఫలమయ్యారని అన్నారు. విద్యాధికారులు యజమాన్యాలు ఇచ్చే మాముళ్ళకు అలవాటు పడి వాటిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మే కాకుండా వారికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. విద్యకు చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25% పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని ఉన్న వాటిని అమలు చేయడంలో విద్యాధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఫీజులు నియంత్రణ చట్టం ప్రకారం ఫీజులు నిర్ణయించడం విద్యాధికారుల ఆధ్వర్యంలో జరగాలి కానీ ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రం ప్రతి సంవత్సరం 25 నుంచి 30% ఫీజులు పెంచుకుంటున్న అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం సరికాదని అన్నారు. జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు బుక్స్ డ్రస్సుల పేరుతో వేల రూపాయలను వసూలు చేస్తూ విద్యా కేంద్రాల్లో షాపులు పెట్టి మరి నడుపుతున్న అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యాధికారులపై వారి విధుల పట్ల విచారణ జరపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
పేరుఘర్సిన సిద్ధార్థ గీత మరియు విద్యా సంస్థలు జిల్లావ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాలలో కూడా వెలుస్తున్నాయంటే విద్యాధికారులు ఏ స్థాయిలో వారికి వత్తాసు పలుకుతున్నారు అర్థం చేసుకోవచ్చన్నారు. తక్షణమే ప్రవేట్ పాఠశాలల విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని అన్నారు
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శేఖర్, అధ్యక్షుడు రవి, లడ్డు, హేమంత్,మహేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
