Home తెలంగాణ సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

310
0

TGN NEWS (సిద్దిపేట):  కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ గౌరవ వందన స్వీకరించి జాతీయ పతాకవిష్కరణ గావించి ప్రజలనుదేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు జోహార్లు.. జై తెలంగాణ బైరాన్ పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వస్తున్న 1948 ఆగస్టు 27 న వందలాది మంది అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పించము సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ను ప్రజా పాలన దినోత్సవం గా జరుపుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు, నిధులు, నియామకాలు ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశయాలు ముందుకు తీసుకుపోతుంది తెలంగాణ సాధన కోసం సకల జనులు పోరాడారు..వారి త్యాగాలు అందరం గుర్తించాలి.. వారందరికీ ధన్యవాదాలు.2023 డిసెంబర్ 7 న మీ అందరి ఆశీర్వాదంతో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం..ఇప్పటి వరకు 200 కోట్లు ఉచిత ప్రయాణాలు దాటాయి..ఆరోగ్య శ్రీ 5 నుండి 10 లక్షలకు పెంచుకున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు అందించాం..కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాల ద్వారా సున్నా వడ్డీ ద్వారా మహిళ పథకాలు అమలుచేస్తున్నాం, ప్రతి పౌరుడు సన్న బియ్యం తినాలని . సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం .9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా,23 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం సన్న వడ్ల కి 500 బోనస్ ఇస్తున్నాం..10 సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురు చూశారు.. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం.., రెవెన్యూ ప్రక్షాళన చేస్తూ భూ భారతి తీసుకొచ్చాం..భూగ్రామ పరిపాలన అధికారులను నియమించాం, తెలంగాణ గీతాన్ని రాష్ట్ గీతంగా పాడుకుంటున్నాం చరిత్ర లో నిలిచే విధంగా పెండింగ్ లో ఉన్న అమరవీరుల స్థూపాన్ని పూర్తి చేస్తాం..చాకలి ఐలమ్మ తొలి తరం ,మలి తరం ఉద్యమకారులను గుర్తు చేసుకుంటున్నాం, తెలంగాణ కవులను కళాకారులను గౌరవించుకుంటున్నాం, సాధించుకున్న తెలంగాణ లో అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రజా పాలన అందిస్తున్నాం, ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృధి కొరకే అని నినదిస్తున్నాం, ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలు సూక్ష్మ స్థాయిలో ప్రజలకు చేరాలా అందించాలి, ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు గతంలో పేదలకు పంపిణీ చేయడానికి భూములు నిధులు ఉండేవి..ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వగలిగేది సంపూర్ణ విద్య..100 శాతం అక్షరాస్యతా.. విద్య కు ప్రథమ ప్రాధాన్యత ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి.. సీఎం గారు,నేను , సిఎస్ రామకృష్ణ రావు ,tgpsc చైర్మన్ వెంకటేశం లాంటి వారు ప్రభుత్వ పాఠశాలల్లో నే చదివి వచ్చాం.. అందరూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఒక మొక్క నాటి తెలంగాణ లో సిద్దిపేట జిల్లా ప్రథమ స్ధానంలో మీకు అభినందనలు తెలియజేస్తున్న.ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డా. అనురాధ, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమ అగ్రవాల్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, అదనపు కలెక్టర్ రెవిన్యూ అబ్దుల్ హమీద్, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ మరియు ఇతర శాఖల సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here