- అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎస్సై మహేశ్వర్ రెడ్డి
TGN NEWS (మేడ్చల్):దుర్గామాత దీవెనలు ప్రజలందరిపై ఉండాలని పెట్ భాషిరాబాద్ ఎస్సై మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ లో ఏర్పాటు చేసిన దుర్గామాతను ఎస్సై దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎస్సై మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేవీ నవరాత్రులు ఎంతో పవిత్రమైనవి అన్నారు. దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 8వ రోజు దుర్గాదేవి సరస్వతీ మాత అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సద్దుల బతుకమ్మ మహిళలకు ప్రత్యేకమైన రోజు అవడంతో అమ్మవారిని అధికసంఖ్యలో మహిళలు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజేపి నాయకులు పట్లోళ్ళ విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్, మాజీ ఎంపిటిసి ఉషిగారి శ్రీనివాస్, మున్సిపల్ అధ్యక్షుడు కావేరి శ్రీధర్, నాయకులు పిడుగుల నాగరాజు, నవీన్, శ్రీకాంత్, గుండ్లపోచంపల్లి యాదవ సంఘం అధ్యక్షుడు ఉనిగొర్ల రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



