నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కలాల్‌వాడ ప్రాంతంలోని ఓ ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగగా, అనంతరం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో అమ్మమ్మ, మనుమడు, మనుమరాలు దుర్మరణం చెందారు.
మృతులను చంద్రకళ (65), లక్ష్మణ్ (16), ప్రణతి (14)గా గుర్తించారు. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సిలిండర్ పేలడంతో వారు తప్పించుకోలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల మరణంతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.




