Home తెలంగాణ నేరాల కట్టడికి మల్కాజిగిరి పోలీసుల క్లస్టర్ విధానం.. క్షేత్రస్థాయి పోలీసింగ్‌కు మరింత బలం

నేరాల కట్టడికి మల్కాజిగిరి పోలీసుల క్లస్టర్ విధానం.. క్షేత్రస్థాయి పోలీసింగ్‌కు మరింత బలం

25
0

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు పోలీసులు క్లస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే ‘మీ సురక్ష’ కార్యక్రమం ద్వారా వివిధ వర్గాల ప్రజల వివరాలను సేకరిస్తున్న పోలీసులు, ఇప్పుడు నేరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొన్ని సెక్టార్లలో బస్తీలు, కాలనీలు, ప్రధాన కూడళ్లు వంటి కీలక ప్రాంతాలను క్లస్టర్లుగా గుర్తిస్తున్నారు. ఆయా క్లస్టర్లలో భద్రతా చర్యలను పెంచడంతో పాటు, క్షేత్రస్థాయి పోలీసింగ్‌ను మరింత పటిష్టం చేస్తున్నారు.

నేరాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో నివసించే వారి వివరాలు స్థానిక పోలీస్‌స్టేషన్ల వద్ద పక్కాగా ఉండేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి పర్యటించి అక్కడి భద్రతా పరిస్థితులను పరిశీలించారు.Malkajgiri Police... - Malkajgiri Police Commissionerate

దీని అనంతరం దిల్‌సుఖ్‌నగర్‌లోని ప్రైవేట్ హాస్టళ్ల యాజమాన్యాలు, విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. హాస్టళ్లలో నివసించే వారి పూర్తి వివరాలను సేకరించి, ఎప్పటికప్పుడు స్థానిక పోలీస్‌స్టేషన్లకు అందజేయాలని యాజమాన్యాలకు సూచించారు.

ఇళ్లలో పని చేసేందుకు కొత్త వ్యక్తులను నియమించుకునే సమయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గతంలో కొందరు నేరగాళ్లు గృహ పనుల పేరుతో ఇళ్లలో చేరి, అవకాశం దొరికినప్పుడు దోపిడీలు, ఇతర నేరాలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో గృహ కార్మికుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని చెబుతున్నారు.

‘మీ సురక్ష’ యాప్ ద్వారా గృహ కార్మికులు, అనుమానితుల వివరాల బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లల భద్రత కోసం అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఉప్పల్ భాగాయత్ ప్రాంతంలో ఇప్పటికే ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి, ఆ ప్రాంతానికి వచ్చి వెళ్లే వారి వివరాలపై నిఘా పెంచారు. సీసీ కెమెరాల ఏర్పాటు, పెట్రోలింగ్ బలోపేతం, స్థానిక సమాచార వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టారు.

విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తూ పెట్రోలింగ్ వ్యవస్థను నిరంతరం అప్రమత్తంగా ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. టెక్నాలజీ వినియోగం, సీసీ కెమెరాల నిఘా, అనుమానితుల డేటా సేకరణ, క్లస్టర్ విధానం ద్వారా మల్కాజిగిరి పోలీసులు నేరాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here