TGN NEWS (నర్సాపూర్): GST ధరల పై నెక్స్ జెన్ జిఎస్టి ప్రచార అభియాన్ కార్యక్రమం సందర్భంగా మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి సారధ్యంలో భారత ప్రభుత్వం GST ధరలు తగ్గించడం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో నివసించే మధ్యతరగతి ప్రజలకు అదేవిధంగా రైతులకు పేదవారికి మేలు జరగాలని ఉద్దేశంతో 28% శాతం ఉన్న జీఎస్టీని 18% శాతానికి 18% శాతం ఉన్న జీఎస్టీని 5% శాతానికి, 12% శాతం ఉన్న జీఎస్టీని 0% శాతం చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి నిరుపేదలైనటువంటి కుటుంబాలకు నిత్యవసర సరుకులే గాని మరియు బైక్, మరియు కారు వంటి వాహనాలను కొనుక్కోవాలని మధ్యతరగతి వారి కళ సాకారం కోసం భారత ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మల సీతారామన్ గారి నేతృత్వంలో ఈ GST ధరల తగ్గింపు ఈనెల 22 నుండి అమలులోకి వస్తుందని చెప్పడం జరిగింది కావున మెదక్ జిల్లాలోని వివిధ వ్యాపారంగ వేత్తలు ప్రజలకు మేలు జరిగే విధంగా ఏవైనా ఖరీదైన వస్తువులు తీసుకుంటే ఈనెల 22 తారీకు తర్వాత తీసుకోవాలని పేద ప్రజలకు మీ వంతు సహకారం కూడా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేయడం జరిగింది, అదేవిధంగా మెదక్ జిల్లాలోని బిజెపి నాయకులకు కూడా తెలియజేయడం ఏమనగా మండల స్థాయిలో గ్రామస్థాయిలో ప్రజలకు రైతులకు ఈ విషయాలను అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్ రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి జిల్లా కార్యదర్శిలు బిక్షపతి, బాలరాజు, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్ ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గుండం శంకర్, మండల అధ్యక్షుడు నీలి నగేష్ పట్టణ అధ్యక్షులు నీరుడి చంద్రయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శిలు సంఘసాని రాజు, రామ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, సీనియర్ నాయకులు కృష్ణ, నర్సారెడ్డి, రాణి, పాండు, బీజేవైఎం నాయకులు మహేందర్ గౌడ్, శ్యామ్ గౌడ్, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు






