Home తెలంగాణ మేడ్చల్ రైతుల విజయం .డబిల్ పూర్ పీఎస్ సిఎస్ చైర్మన్ సురేష్ రెడ్డి

మేడ్చల్ రైతుల విజయం .డబిల్ పూర్ పీఎస్ సిఎస్ చైర్మన్ సురేష్ రెడ్డి

250
0

రైతు భరోసా నిధులు మేడ్చల్ రైతు అకౌంట్లో జమ కావడం రైతుల విజయమని డబిల్ పూర్ పీ ఏసీ ఎస్ చైర్మన్ సురేష్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మేడ్చల్ జిల్లా రైతులను గత రెండు దఫాలుగా రైతు భరోసా వేయకుండా బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందని తెలిపారు. దీంతో రైతులు, రైతు నాయకులు పిఎసిఏ చైర్మన్లు పిఎసిఎస్ డైరెక్టర్ల కృషి వల్ల రైతు భరోసా నిధులు రైతు అకౌంట్లో జమవుతున్నాయని తెలిపారు. కలెక్టర్ మిక్కిలినేని ముని చౌదరి కి మ జిల్లా వ్యవసాయ అధికారిని చంద్రకళ కు రింగ్ రోడ్డుకు దగ్గర ఉన్న రైతులు వ్యవసాయం చేయడం లేదా? వడ్లు పండించడం లేదా? అంటూ తెలంగాణలో ఉన్న రైతులందరితోపాటు మాకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలని ఇచ్చిన వినతి పత్రం ఇవ్వడంతో స్పందించిన ప్రభుత్వం రైతుల అకౌంట్లో రైతు భరోసా నిధులు జమ చేసినందుకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని సురేష్ రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here