Home తెలంగాణ
169
0

తేనేటిగల పెంపకం రైతులకు వరంలాంటిది: పండర

TGN NEWS (జహీరాబాద్): తేనెటీగల పెంపకం రైతులకు వరంలాంటిదని జిల్లా ఉద్యాన వన, మరియు పట్టు పరిశ్రమల శాఖ జిల్లా అధికారి సీ హెచ్ పండరి పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని కేవికే ఆవరణలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సి హెచ్ పండరి, కేవికే సిటివో వరప్రసాద్, కే వి కె శాస్త్రవేత్తలు స్నేహలత, శైలజ, హేమలత, రమేష్, ఎఫ్ఆర్ ఎస్ సైంటిస్ట్ నితీష్,సేరికల్చర్ అధికారి శ్రీనివాస్ హెచ్ఈవో విట్టల్, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తేనెటీగల పెంపకం ద్వారా రైతులు అధిక ఆదాయం ఆర్జించవచ్చని రైతులను తేనెటీగల పెంపకం పై శిక్షణ ఇస్తూ ఆదిశగా తమ పంట పొల్లాలో తేనెటీగల పెంపకంను చేపట్టెందుకు ప్రయత్నం చేస్తున్నట్లు అయన వివరించారు.రైతులు వ్యవసాయంతో పాటుగా తేనెటీగల పెంపకం పై దృష్టి సారిస్తే, పంట దిగుబడితో పాటుగా, తేనె అమ్మకం ద్వారా ఆదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చని అయన సూచించారు.ఇందులో మెళుకువ లను, యాజమాన్య పద్ధతులను తెలియజేసారు తేనెటీగలలో 20వేల రకాలు ఉండగా, వీటిలో ఎపి స్మెల్లా ఫెరా, ఎపిశెరా రకాలు పెంపకం కు అనువైనవని అయన తెలిపారు. ఇవి బాక్స్ లలో ఫ్రేమ్ లు ఏర్పాటు చేసుకుని వాటిలో నివసిస్తూ, బయటకు తిరిగి తేనె సేకరించి ఇందులోని ఫ్రేమ్స్ లలో తేనె తుట్టెలు పెడతాయి.పొలాలలో తేనెటీగల పెంపకం వల్ల కలిగే లాభాల గురించి రైతులకు శాస్త్రవేత్తలు తెలియజేస్తారని చెప్పారు. తేనెటీగల పెంపకం వల్ల ప్రకృతి సమతుల్యం ఏర్పడుతుందని,ఇటీవల కాలంలో పొలాలలో మోతాదుకు మించి వాడుతున్న రసాయనలు, పురుగు మందులు కారణంగా పంటల ఎదుగుదలకు దోహదపడే మిత్ర పురుగులు నశించిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంటల దిగుబడి పెరిగేందుకు తోడ్పడే పరపరాగ సంపర్కం కోసం తేనెటీగల పెంపకం పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. ఇందుకు గాను తమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పధకాలు ఉన్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడిన కెవికే సి టి వో వరప్రసాద్, శాస్త్రవేత్తలు స్నేహలత, శైలజ, హేమలత, రమేష్ లు మాట్లాడుతూ తేనెటీగల బాక్స్ ల మూలంగా తేనెటీగల పెంపకంను చేపట్టే వారికి నిర్వహణ వ్యయం పెద్దగా లేకపోవడం, ఒకేసారి మాత్రమే తేనెటీగల పెట్టేకు 5500 రూపాయల నుండి 7000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం వల్ల చిన్న, సన్నకారు రైతులు వీటిని తమ పొలాల్లో ఏర్పాటు చేసుకోవచ్చని, పొలాలలో తేనెటీగల పెంపకం వల్ల పూత దశ లో ఉన్న పంటకు పరపరాగా సంపర్కం జరిగి పంట దిగుబడి పెరగడంతో పాటుగా తేనె సైతం లభించి రైతులకు అదనపు ఆదాయం కలుగుతుందని పేర్కొన్నారు. అనంతరం పట్టుపురుగుల పెంపకాన్ని, మల్బరి తోట ను పొలంలో వేసిన రైతు పొలాన్ని సందర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here